Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప-2’ నుంచి సాంగ్ రిలీజ్

  • ‘పుష్ప పుష్ప..’ సాంగ్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్
  • ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్న లిరికల్ సాంగ్
  • సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్
song Relesed from Allu Arjun Pushpa 2 Movies

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు దేశవ్యాప్తంగా సినీ జనం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న పుష్ప-2 మూవీ నుంచి బుధవారం ఒక లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘‘పుష్ప పుష్ప..’’ సాంగ్‌ను యూట్యూబ్ వేదికగా రిలీజ్ చేసింది. 

‘పుష్ప’ రాకను ‘‘పుష్ప పుష్ప...’’ జపంతో సెలబ్రేట్ చేసుకోండి’ అనే క్యాప్షన్‌తో సాయంత్రం 5.05 నిమిషాలకు చిత్రయూనిట్ ఈ పాటను విడుదల చేసింది. ఈ సాంగ్‌ ఫ్యాన్స్‌ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. లిరికల్ వీడియోలో మధ్య మధ్యలో కనిపిస్తున్న అల్లు అర్జున్ స్టిల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి. కాగా సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమాకు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్, రస్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్‌‌తో పలువురు అగ్రనటులు ఉన్నాయి.

More Telugu News